క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-03T05:45:28+05:30 IST

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

క్రికెట్‌ పోటీలు ప్రారంభం
కులకచర్లలో క్రికెట్‌ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు

కులకచర్ల, అక్టోబరు 2: మైత్రీ యువజన సంఘం ఆధ్వర్యంలో కులకచర్లలో ఆదివారం జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రహ్లాద్‌రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు మైపాల్‌ పాల్గొని పోటీ లను ప్రారంభించారు. విజేత టీంకు రూ.15వేలు, రన్నర్స్‌కు రూ.10వేలు, మూడో జట్టుకు రూ.7వేలు అందజేయనున్నారు. 40జట్లు పాల్గొంటున్నాయి. నాయకులు, నిర్వాహకులు ఆంజనేయులు, కుమ్మరిస్వామి, వెంకటేశ్‌, రమేశ్‌, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

Read more