రిక్షా కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2022-10-12T04:18:10+05:30 IST

రిక్షా కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

రిక్షా కాలనీలో కార్డన్‌ సెర్చ్‌
కాలనీలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

వికారాబాద్‌,అక్టోబరు 11 : వికారాబాద్‌లోని రిక్షా కాలనీలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్‌  నిర్వహించారు. వికారాబాద్‌  డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీతోపాటు ఇద్దరు సీఐలు,   ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, తదితరులు తనిఖీలు నిర్వహించారు.  కాలనీలోని ప్రతిఇంటిని తనిఖీ చేశారు. 20 ద్విచక్ర  వాహనాలు, మూడు కార్లు, నాలుగు ఆటోలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కొత్తగా కాలనీలో కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీఐ శ్రీను పాల్గొన్నారు. 

Read more