భార్యను వేధించిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-03-17T04:51:27+05:30 IST

భార్యను వేధించిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

భార్యను వేధించిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

యాచారం, మార్చి 16: భార్యను వేధించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ను బుధవారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రాణి వివాహం మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన పలమోని జంగయ్యతో 2014లో జరిగింది. భార్యను జంగయ్య అదనపు కట్నం కోసం నిత్యం వేదిస్తున్నాడు. అంతేకాకుండా వేరే యువతి అండ చూసుకొని తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Read more