హిందువులపై దాడులకు పలు సంస్థల కుట్ర

ABN , First Publish Date - 2022-10-03T05:56:40+05:30 IST

హిందువులపై దాడులకు పలు సంస్థల కుట్ర

హిందువులపై దాడులకు పలు సంస్థల కుట్ర
మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

చేవెళ్ల, అక్టోబర్‌ 2: హిందువులపై దాడులకు పీఎ్‌ఫఐ వంటి సంస్థలు కుట్రలు చేస్తున్నాయని ఆర్‌ఎ్‌సఎస్‌ పాలమూరు విభాగ్‌ సంఘచాలక్‌ వేమిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ర్టీయ స్వయంసేవక సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) ప్రాథమిక సంఘ శిక్ష వర్గ సార్వజనికోత్సవం చేవెళ్ల మండల పరిధిలోని ధర్మసాగర్‌ గ్రామం పరిధిలోని బండారి శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో  ఆదివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివా్‌సరెడ్డి హాజరై మాట్లాడారు. 4వేల ఏళ్ల నాటి విష్ణుపురాణంలో భారత్‌ప్రస్తావన ఉందన్నారు. దేశంలో విదేశీ మూలాలు ఉన్నవారు ఎవరూ లేరని, విదేశీ మతాలను అవలంభిస్తున్న వారి పూర్వికులు కూడా హిందువులే అని స్పష్టం చేశారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి వ్యక్తులు ఆర్‌ఎ్‌సఎ్‌సను కీర్తించారని గుర్తుచేశారు. సమాజానికి హాని చేసే పీఎ్‌ఫఐను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 518మంది స్వయం సేవకులు శిక్షణ తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక శిక్ష వర్గాధికారులు గాజుల సిద్దిరామేశ్వర్‌, సర్వాధికారి కండ సంఘ్‌చాల బిల్ల పాటి కృష్ణారెడ్డి, జిల్లా కార్యవాహలు కేరెళ్లి అనంత్‌రెడ్డి, జిల్లా సంఘ్‌ చాలక్‌ డాక్టర్‌ సత్యనారాయణరెడ్డి, సామాజిక సామరస్వతప్రముఖ్‌ కొత్త కాపు గోవర్థన్‌రెడ్డి, జిల్లా సహకార్యవాహ తీగుల నర్సింహులు, పరిగి సంఘచాలకులు బ్రహ్మయ్య, విభాగ్‌ భౌదిక్‌ ప్రముఖ్‌, కట్ట ప్రభాకర్‌, బీఎ్‌సఐటీ కళాశాల చైర్మన్‌ బండారు శ్రీనివాస్‌, బీజేపీ మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 

Read more