‘మునుగోడులో కాంగ్రెస్‌దే విజయం’

ABN , First Publish Date - 2022-10-12T05:07:48+05:30 IST

‘మునుగోడులో కాంగ్రెస్‌దే విజయం’

‘మునుగోడులో కాంగ్రెస్‌దే విజయం’

కడ్తాల్‌, అక్టోబరు 11: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు.  ప్రజా విశ్వాసం కోల్పోయిన  బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు దొడ్డి దారిన గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ధర్మ పోరాటం కొనసాగిస్తూ అంతిమ విజయం సాధిస్తుందన్నారు. అధికార బలంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి చేసి దగ్దం చేయడం హేయనీమైన చర్య అని అన్నారు.  దుండుగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని శ్రీనివా్‌సరెడ్డి డిమాండ్‌ చేశారు. 

Read more