-
-
Home » Telangana » Rangareddy » Congress party will be in power in the next elections-MRGS-Telangana
-
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం
ABN , First Publish Date - 2022-08-18T04:58:57+05:30 IST
వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

శంకర్‌పల్లి, ఆగస్టు 17 : వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు సున్నపు వసంతం అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం శంకర్‌పల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల నియోజకవర్గంలో 75కిలోమీటర్ల ఆజాదీకా గౌరవ్ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్రకు గ్రామాల్లో మంచిస్పందన వస్తుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెపారు. కార్యక్రమంలో యాలాల మహేశ్వర్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, శ్రీనివా్‌సగౌడ్, మల్లేశ్, మల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, హనీఫ్, పాషా, మహ్మద్ ఖదీర్, లియాకత్ తదితరులు ఉన్నారు.