షాబాద్ తహసీల్దార్‌పై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-04-19T05:19:03+05:30 IST
షాబాద్ తహసీల్దార్‌పై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
షాబాద్, ఏప్రిల్ 18: రైతులకు తప్పుడు సమాచారం అందించి భూములను సర్వే చేయించిన షాబాద్ తహసీల్దార్ ఆమర్‌లింగంగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని పోతుగల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ తిరుపతిరావును కలిసి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధిత రైతులు మాట్లాడుతూ గ్రామంలోని సర్వేనెంబర్ 183లో భూములను వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. భూములును తహసీల్దార్ తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయించారని వాపోయారు. ఆ సర్వేనెంబర్‌లో అదనంగా భూమిఉందని రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చి సర్వే చేయించడంతో పాటు రైతులను నమ్మించి నిరభ్యంతర పత్రాలపై సంతకాలు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయం చేవెళ్ల ఆర్‌డీవో వేణుమాదవ్‌రావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు చంద్రయ్య, నర్సింలు, జంగయ్య, విఠలయ్య, అంజయ్య, కృష్ణ, రాములు, ఉన్నారు.