వెంకటేశ్వర హాచరీ్‌సపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-15T23:51:22+05:30 IST
: మంగళగూడ, కొత్తపేట శివారులోని వెంకటేశ్వర హాచరీ్‌సపై గురువారం మంగళగూడ గ్రామానికి చెందిన కొట్టం అరవీందర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ధనుంజయ్‌కి ఫిర్యాదు చేశాడు.
కేశంపేట, డిసెంబరు 15: మంగళగూడ, కొత్తపేట శివారులోని వెంకటేశ్వర హాచరీ్‌సపై గురువారం మంగళగూడ గ్రామానికి చెందిన కొట్టం అరవీందర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ధనుంజయ్‌కి ఫిర్యాదు చేశాడు. వెంకటేశ్వర హాచరీలో కోళ్ల వ్యర్థాలను ఆరు బయట డంప్ చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల గ్రామంలో దుర్గందం వెదజల్లుతోందని తెలిపారు. రూ.80వేలు విలువ చేసే తన పాడి ఆవు కోళ్ల వ్యర్థాల గుంతలో పడి తీవ్రగాయాలపాలైందని తెలిపాడు. ఆవు బతికే పరిస్థితి లేదని తెలిపాడు. అదేవిధంగా ఫామ్‌లో మృత్యువాత పడిన కోళ్లను బయట పారేస్తుండడంతో వీధి కుక్కలు తిని లేగదూడలపై దాడులు చేస్తున్నాయని వాపోయాడు. దీంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని తెలిపాడు. ఇందుకు కారణమైన వేంకటేశ్వర హాచరీ్‌సపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.