ప్రొటోకాల్ పాటించలేదని కొడంగల్ సీఐ, ఎస్సైపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-07T23:27:34+05:30 IST
ఈ నెల 4, 5 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటన సమయంలో సీఐ, ఎస్సైలు ప్రొటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కొడంగల్, డిసెంబరు 7: ఈ నెల 4, 5 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటన సమయంలో సీఐ, ఎస్సైలు ప్రొటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు బుధవారం కొడంగల్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన ఎస్పీ కోటిరెడ్డిని ఆయన కలిసి సీఐ, ఎస్సైలపై ఫిర్యాదు చేశారు.