ఆటోక్లేవ్‌ మిషన్‌ చోరీపై విచారణ కమిటీ

ABN , First Publish Date - 2022-07-19T05:26:12+05:30 IST

ఆటోక్లేవ్‌ మిషన్‌ చోరీపై విచారణ కమిటీ

ఆటోక్లేవ్‌ మిషన్‌ చోరీపై విచారణ కమిటీ

కొందుర్గు, జూలై 18: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఇటీవల  జరిగిన ఆటో క్లేవ్‌ చోరీపై విచారణ కమిటీ వేసినట్లు షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వస్తువుల పూర్తివివరాలు సేకరించాలని ఇద్దరుసభ్యులతో కమిటీ వేశామని, కమిటీరిపోర్టు ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా చోరీ విషయమై పోలీసుల విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఆయన వెంట మండల వైధ్యాధికారిణి డాక్టర్‌ అమ్రిత జోసఫ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, ప్రభులింగం తదితరులు ఉన్నారు.  

Read more