సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం : ఎమ్మెల్యే ఆనంద్
ABN , First Publish Date - 2022-08-04T05:44:57+05:30 IST
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం : ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, ఆగస్టు 3: అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చేయూతనిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించడంలో సీఎం సహాయనిధి ఎంతగానో చేయూతనందిస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గ ప్రజలందరికీ సకాలంలో చెక్కులు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, సురేష్,రామస్వామి, గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, బొండల శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- దళిత కుంటుంబాల వృద్ధికే ‘దళితబంధు‘
బంట్వార(కోట్‌పల్లి) ఆగస్టు 3: దళిత కుంటుంబాలను అభివృద్ది చేసేందుకే ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తోందని ఎమ్మెల్యే అనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని రాంపూర్‌లో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారుల దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతగానో లబ్ధిపొందుతున్నారని అన్నారు. కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైౖర్మన్ రాంచంద్రారెడ్డి, కోట్‌పల్లి మండలాధ్యక్షుడు అనిల్, నాయకులు వెంకటేశ్‌యాదవ్, బందెయ్య పాల్గొన్నారు.