సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం
ABN , First Publish Date - 2022-01-21T05:40:06+05:30 IST
సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం

మేడ్చల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ 13వ వార్డుకు చెందిన ఎన్.కోమల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో మంజూరైన రూ.23,500 చెక్కును గురువారం మంత్రి చేతులమీదుగా లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.