క్రైస్తవుల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-12-15T22:59:16+05:30 IST

రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధికి చేయూతనిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

క్రైస్తవుల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌
క్రైస్తవులకు కొత్త దుస్తులను అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

క్రిస్మస్‌ కానుకల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి

శామీర్‌పేట, డిసెంబరు 15: రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధికి చేయూతనిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. క్రిస్మ్‌సను పురస్కరించుకొని క్రిస్టియన్లకు ప్రభుత్వ కానుకగా పంపిణీ చేస్తున్న దస్తులను గురువారం అలియాబాద్‌లోని ఆర్యా ఫంక్షన్‌ హాల్‌లో మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కుత మతాలకు అతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు ఉత్తమ పాలన అందుతోందన్నారు. మత భేదాలు లేకుండా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వారివారి పండుగల సందర్భంగా ప్రభుత్వకానుకలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యెల్లుబాయి, జెడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ జహీరుద్దీన్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ కుమార్‌యాదవ్‌, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:59:29+05:30 IST