భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రార్థనలు
ABN , First Publish Date - 2022-11-17T00:19:10+05:30 IST
ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరలో రెండో రోజు బుధవారం క్రైస్తవులు తరలివచ్చి యేసు ప్రభువు శిలువల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రెండో రోజూ వైభవంగా మెథడిస్టు జాతర
ధారూరు, నవంబరు 16 : ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరలో రెండో రోజు బుధవారం క్రైస్తవులు తరలివచ్చి యేసు ప్రభువు శిలువల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యేసుక్రీస్తు భక్తులు జాతరకు వచ్చి గుడారాలు వేసుకుని ఇక్కడే బస చేశారు. జాతర ప్రాంగణం ప్రధాన వేదిక, ముఖ ద్వారం వద్ద ఉన్న యేసు క్రీస్తు శిలువల వద్ద ప్రార్థనలు చేశారు. మత గురువుల దైవ సందేశాలు, కీర్తనలు వింటూ భజనలు చేస్తూ రాత్రింబవళ్లు ప్రభువు నామస్మరణ చేశారు. జాతర ప్రాంతంలో వివిధ దుకాణాలు, హోటళ్లు, రంగుల రాట్నాలు వెలిశాయి. శుక్రవారం నుంచి జాతరకు భక్తుల రద్దీ పెరగనుంది.