వైభవంగా చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-06-09T05:21:29+05:30 IST

వైభవంగా చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

వైభవంగా చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు
పూజల్లో పాల్గొన్న భక్తులు

 

బొంరాస్‌పేట్‌, జూన్‌ 8: మండల పరిధిలోని దుద్యాల్‌ గ్రామంలో శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మహిళలు బోనాల ఊరేగింపుగా వెళ్లి  అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు ఆలయంలో దుర్గసూక్త హోమం, గణపతి, నవగ్రహ, రుద్ర హోమాలు, అంకురార్పణ, ధాన్యధివాసం, ప్రదోషకాల పూజలు, చతుర్వేద పారాయణ సంగీతసేవ, పుష్పాధివాసం, హారతి, మంత్ర పుష్పం, షయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-06-09T05:21:29+05:30 IST