అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది

ABN , First Publish Date - 2022-11-24T23:45:42+05:30 IST

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మహా గొప్పదని ఎదులాబాద్‌ శ్రీ సాయి నిలయం ధర్మకర్త కాలేరు నవీన్‌కుమార్‌ అన్నారు.

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 24 : అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మహా గొప్పదని ఎదులాబాద్‌ శ్రీ సాయి నిలయం ధర్మకర్త కాలేరు నవీన్‌కుమార్‌ అన్నారు. మండల పరిధి శ్రీసాయి నిలయంలో ప్రతినెలా చివరి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈమేరకు ఆలయంలో ఉదయం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అర్చనలు, అభిషేకాలు, హారతి నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆగమయ్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి కుమార్‌శర్మ, భక్తులు లవంగు రమణ్‌రాజు, మల్లికార్జున్‌, బట్టె రవి, నర్సింగ్‌రావు, సంతోష్‌, అయ్యప్ప మాలధారులు పూస కృష్ణ, నర్సింగ్‌రావు, సంతోష్‌, సురేష్‌, సుధాకర్‌, మహే్‌షగౌడ్‌, శ్రీధర్‌, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:45:42+05:30 IST

Read more