పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-11-22T00:11:57+05:30 IST

కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కేంద్ర బృందం సందర్శించింది.

పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం
పీహెచ్‌సీ వివరాలు బృందానికి తెలియజేస్తున్న వైద్యాధికారి సరిత

కీసర, నవంబరు 21: కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కేంద్ర బృందం సందర్శించింది. నేషనల్‌ క్యాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్ట్‌ బృందాన్నికి చెందిన ప్రతినిధులు డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ భరణి రోగులకు అందుతున్న సేవలు, రోజువారీ రోగుల సంఖ్య, ఇన్‌పేషంట్లు, ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, రోగుల మందుల పంపిణీ గురించి తెలసుకున్నారు. అధికారుల, సిబ్బంది, కార్మికుల పనితీరు, గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఆసుపత్రి నిర్వహణ వివరాలను మండల వైద్యాధికారి సరితను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-11-22T00:11:58+05:30 IST