ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-04T05:50:34+05:30 IST
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
కొడంగల్, ఆగస్టు 3: మండల పరిధిలోని రుద్రారంలో అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈమేరకు బుధవారం గ్రామపంచాయతీలో గర్భిణీలు, కిషోరబాలికలతో ర్యాలీ చేపట్టారు. వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు అందించడంతో వ్యాధినిరోధకంగా పని చేస్తుందని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు అందించడం ఎంతో శ్రేయస్కరం అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు హఫీజ, ఉమారాణి, సంతోష, సుగుణ, వెంకటమ్మ, శాంత తదితరులు పాల్గొన్నారు.