సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-08T05:52:24+05:30 IST

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఆమనగల్లు/కొందుర్గు, సెప్టెంబరు 7:  ఎర్రబీక్య తండా లో మున్సిపాలిటీ పట్టణ ప్రగతి నిధులు రూ.25 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు  పనులను ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి బుధవారం మున్సిపల్‌చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్యలతో కలిసి ఆచారి పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు రవిరాథోడ్‌, నంగ్య్ర నాయక్‌, హన్మంత్‌, సక్రునాయక్‌, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గులోని 1వ వార్డులో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణపు పనులను బుధవారం వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కావలి ఆదిలక్ష్మీ యాదయ్య, లింగం, గోపాల్‌, జగదీశ్వర్‌గౌడ్‌, ప్రభాకర్‌, సుందర్‌, వాసురి, చంద్రశేఖర్‌, శ్రీశైలం, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Read more