పశువుల పట్టివేత

ABN , First Publish Date - 2022-10-05T04:58:39+05:30 IST

యాచారం పోలీసులు మంగళవారం వేర్వేరు చోట్ల అక్రమంగా

పశువుల పట్టివేత
యాచారం పోలీసులు పట్టుకున్న పశువులు

యాచారం, అక్టోబర్‌ 4: యాచారం పోలీసులు మంగళవారం వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 62 పశువులను పట్టుకుని నగరంలోని గోశాలకు తరలించారు. యాచారంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం సంత నుంచి అక్రమంగా డీసీఎంలో 51 పశువులను హైదరాబాద్‌ తరలిస్తుండగా పట్టుకున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం  పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా సూర్యాపేట జిల్లా కోదాడ సంత నుంచి హైదరాబాద్‌కు బొలేరో వాహనంలో 11పశువులను తరలిస్తుండగా  పోలీసులు  పట్టుకున్నారు. ఇందులో ఓ పశువు మృత్యువాతపడింది. ఇరువురు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐలు వెంకటనారాయణ, శంకరయ్యలు చెప్పారు. Read more