బిల్డింగ్‌ కాంట్రాక్టర్లపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-30T23:50:50+05:30 IST

ఒప్పందం ప్రకారం బిల్డింగ్‌ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసి బెదిరింపులకు పాల్పడిన బిల్డింగ్‌ కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.

బిల్డింగ్‌ కాంట్రాక్టర్లపై కేసు నమోదు

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30: ఒప్పందం ప్రకారం బిల్డింగ్‌ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసి బెదిరింపులకు పాల్పడిన బిల్డింగ్‌ కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మల్కారం గ్రామానికి చెందిన ఏవీ గణపతి అనే వ్యక్తి డజన్‌ గ్రీన్‌ లేవుట్‌లో ప్లాట్‌ నెంబర్లు 33, 44, 35లలో ఇంటి నెం4-4/10 బిల్డింగ్‌ నిర్మాణం చేపట్టాడు. ఇందుకు బెంగళూర్‌కు చెందిన హంర్నిచ్‌ టెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం ఉనికృష్ణ, అర్జున్‌, నిసాలకు రూ.1.10కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందంలో భాగంగా ఏవీ గణపతి వారికి రూ.80.53 అడ్వాన్స్‌గా ఇచ్చాడు. కాగా ఉన్నట్టుండి కంపెనీ కంట్రాక్టర్లు వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లో సుమారు రూ.30లక్షల వరకే నిర్మాణాన్ని పూర్తి చేశారు. నిర్మాణాన్ని ఒప్పందం ప్రకారం పూర్తి చేయాలని లేదంటే ఇచ్చిన అడ్వాన్‌ తిరిగి ఇవ్వాలని గణపతి కోరాడు. కంపెనీ కాంట్రాక్టర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. గణపతి చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-30T23:50:50+05:30 IST

Read more