కారు-బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2022-12-15T00:18:41+05:30 IST
నాగార్జునసాగర్ రహదారిపై గురునానక్ ఇంజినీరింగ్ కాలేజి వద్ద బుధవారం సాయంత్రం కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 14: నాగార్జునసాగర్ రహదారిపై గురునానక్ ఇంజినీరింగ్ కాలేజి వద్ద బుధవారం సాయంత్రం కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మాడ్గుల తహసీల్దార్ దేవుజా డ్రైవర్‌తో కలిసి బుధవారం సాయంత్రం మాడ్గుల నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. గురునానక్ ఇంజినీరింగ్ కాలేజి వద్ద ఎదరుగా వచ్చిన బైక్‌ను కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి గాయాల య్యాయి. క్షతగాత్రులు నేరుగా ఆస్పత్రికి వెళ్లారని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ రామకృష్ణ తెలిపారు.