-
-
Home » Telangana » Rangareddy » Byeelections are selfish of BJP-MRGS-Telangana
-
బీజేపీ స్వార్థంతోనే ఉప ఎన్నికలు
ABN , First Publish Date - 2022-10-12T05:05:07+05:30 IST
బీజేపీ స్వార్థంతోనే ఉప ఎన్నికలు

ఆమనగల్లు, అక్టోబరు 11: స్వార్థ రాజకీయం కోసం మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ ఓటమిని ముందుగానే గ్రహించి దొడ్డిదారిన గెలిచేందుకు కుట్రలు సాగిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని తనకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన రేవల్లి, తుమ్మలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో మంగళవారం ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని వ్యక్తిగత లాభం కోసం మోదీకి తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని అన్నారు. టీఆర్‌ఎస్ వచ్చాకే మునుగోడు ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ తాగు జలాలు అందించి ఫ్లోరైడ్ బారినుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాక