జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో బటర్‌ఫ్లై విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-12-07T23:24:00+05:30 IST
జాతీయ స్థాయి సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థుల ఖోఖో పోటీలలో కడ్తాల పార్చ్యూన్ బటర్‌ప్లై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
కడ్తాల్, డిసెంబరు 7: జాతీయ స్థాయి సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థుల ఖోఖో పోటీలలో కడ్తాల పార్చ్యూన్ బటర్‌ప్లై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. క్లస్టర్ స్థాయిలో ద్వితీయ బహుమతి అందుకున్నారు. రాజమండ్రిలో ఈనెల 4 నుంచి 6వ తేది వరకు జరిగిన పోటీల్లో పార్చ్యూన్ బటర్‌ప్లై స్కూల్‌కు చెందిన సీబీఎ్‌సఈ క్లస్టర్ విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు. ట్రోఫీని గెలుచుకున్న విద్యార్థులకు బుధవారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శేషగిరిరావు, కో-పౌండర్ రమేశ్, ప్రిన్సిపల్ సంజీవ్ నాంపల్లి, పీఈటీలు రాము, యాదగిరి, మహేందర్, రాంచందర్, గీత పాల్గొన్నారు.