బస్‌ షెల్టర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-13T05:11:59+05:30 IST

బస్‌ షెల్టర్‌ ప్రారంభం

బస్‌ షెల్టర్‌ ప్రారంభం
బస్‌ షెల్టర్‌ను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ భాస్కర్‌

శామీర్‌పేట, ఆగస్టు 12: మండల పరిధిలోని మురహరిపల్లి గ్రామ సమీపంలోని ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ హౌసింగ్‌ కాలనీ వద్ద ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బస్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ దార భాస్కర్‌ బస్‌షెల్టర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ హోమ్స్‌ యజమానులను అభినందించారు. ఉపసర్పంచ్‌ జైపాల్‌రెడ్డి, వార్డు సభ్యులు, కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఐవీ రావు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:11:59+05:30 IST