విద్యుదాఘాతంతో గేదె మృతి

ABN , First Publish Date - 2022-12-15T00:17:30+05:30 IST

యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండాలో బుధవారం మధ్యాహ్నం రూ లక్ష విలువైన పాడిగేదె విద్యుత్‌ షాక్‌కు గురై దుర్మరణం పాలైంది.

విద్యుదాఘాతంతో గేదె మృతి

యాచారం, డిసెంబరు 14: యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండాలో బుధవారం మధ్యాహ్నం రూ లక్ష విలువైన పాడిగేదె విద్యుత్‌ షాక్‌కు గురై దుర్మరణం పాలైంది. తండాకు చెందిన శారద తనకున్న పాడిగేదెతో జీవనం సాగిస్తుంది. బుధవారం తన పంటపొలానికి సమీపంలో మరో రైతు బోర్‌మోటార్‌ స్టాటర్‌ బిగించారు. స్టాటర్‌కున్న వైర్లు గాలికి వైర్లు తెగి ఇనుప జాలీకి ఆనుకున్నాయి, దీనిని రైతు గమనించలేకపోయారు. పాడిగేదె మేత వేస్తూ షాక్‌కు గురై దుర్మరణం పాలైంది. గేదె మరణంతో తనకు ఉపాది లేకుండపోయిందని బాదిత రైతు రోదించారు. ఈ మేరకు యాచారం పోలీసులకు పిర్యాదు చేశారు.

Updated Date - 2022-12-15T00:17:31+05:30 IST