బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-12T05:19:59+05:30 IST
బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం
ఘట్‌కేసర్: మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోచారం శివాలయం నుంచి షెర్నిహిల్స్ కాలనీ వరకు రూ.32లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటామన్నారు. ప్రధానంగా బీటీ, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి పైపులైన్ల ఏర్పా టు కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో పోచారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రెడ్డియానాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్, బద్దం జగన్‌మోహన్‌రెడ్డి, అబ్బవతిని నర్సింహ, వర్క్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, స్థానికులు పాల్గొన్నారు.