బీఎ్‌సఎన్‌ఎల్ ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-12-07T23:29:13+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో బీఎ్‌సఎన్‌ఎల్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని డీజీఎం జితేందర్‌సింగ్ కోరారు.
కందుకూరు, డిసెంబరు 7: గ్రామీణ ప్రాంతాల్లో బీఎ్‌సఎన్‌ఎల్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని డీజీఎం జితేందర్‌సింగ్ కోరారు. బుధవారం మండలంలోని కందుకూరు, రాచులూరు, నేదునూరు, దెబ్బడగూడ గ్రామాల్లోని బీఎ్‌సఎన్‌ఎల్ భవనాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎ్‌సఎన్‌ఎల్ ఫైబర్ కేబుల్‌ను ప్రతిఇంటికీ విస్తరిస్తామని తెలిపారు. దీనికిగాను నాణ్యమైన ఆప్టికల్ ఫైబర్ బ్యాండ్, ల్యాండ్ లైన్, ఇంటర్నెట్ సేవలను అందించడానికి బీఎ్‌సఎన్‌ఎల్ సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 30వ తేదీలోపు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత వైఫై మోడెమ్, ఫ్రీ ఇన్‌స్టాలేషన్ ఆఫర్లు ఉన్నాయన్నారు. బీఎ్‌సఎన్‌ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలను కునేవారు జేటీవో రాఘవేంద్ర (9441361441), లేన్‌మన్ సత్తయ్య (9948060190)లను సంప్రదించాలన్నారు. హెచ్‌టీటీపీఎ్‌స:శ్రీశ్రీబుక్‌ఫైబర్.బీఎ్‌సఎన్‌ఎల్.కం.ఇన్ లేదా మై బీఎ్‌సఎన్‌ఎల్ ఏపీపీ ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సుదర్శన్‌రావు, ఎస్‌డీవో రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.