ఢిల్లీకి తరలిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , First Publish Date - 2022-12-15T00:29:55+05:30 IST

ఢిల్లీలో జరిగిన భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి బుధవారం ఘట్‌కేసర్‌ మండలం నుంచి నాయకులు తరలివెళ్ళారు. ఈమేరకు వారు మంత్రి మల్లారెడ్డిని కలిశారు.

ఢిల్లీకి తరలిన బీఆర్‌ఎస్‌ నాయకులు
ఘట్‌కేసర్‌ రూరల్‌ : బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డితో మండల నాయకులు

ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/శామీర్‌పేట/వికారాబాద్‌/కొడంగల్‌, డిసెంబరు 14 : ఢిల్లీలో జరిగిన భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి బుధవారం ఘట్‌కేసర్‌ మండలం నుంచి నాయకులు తరలివెళ్ళారు. ఈమేరకు వారు మంత్రి మల్లారెడ్డిని కలిశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు ఓరుగంటి వెంకటే్‌షగౌడ్‌, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివా్‌సగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం ఢిల్లీకి తరలివెళ్లారు. ఈమేరకు ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనీ జంగయ్యయాదవ్‌, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు బండారి శ్రీనివా్‌సగౌడ్‌, తదితరులు బుధవారం జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. శామీర్‌పేట జడ్పీటీసీ అనితా లాలయ్య, ఎంపీపీ ఎల్లుబాయి, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు తదితర నాయకులు బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈమేరకు జడ్పీటీసీ అనితా లాలయ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం పురస్కరించుకుని వికారాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:29:56+05:30 IST