తెగిన విద్యుత్ వైర్.. పట్టించుకోని అధికారులు
ABN , First Publish Date - 2022-12-16T23:16:19+05:30 IST
చిన్నతూండ్ల గ్రామ పరిధిలో 132 కేవీ వైర్ తెగి పంటపొలాల్లో పడిపోయినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
యాచారం, డిసెంబరు 16: చిన్నతూండ్ల గ్రామ పరిధిలో 132 కేవీ వైర్ తెగి పంటపొలాల్లో పడిపోయినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగి విద్యుత్ వైర్ తెగిపడిందని తెలిపారు. దీంతో 10 వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయాయని చెప్పారు. ఈ విషయమై బాధిత రైతులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించగా... గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, గురువారం తెగిన వైరును పునరుద్ధరిస్తామని విద్యుత్ అధికారులు చెప్పారు. కానీ శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రమాదం వల్ల సుమారు రూ.లక్షా 10వేల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని వాపోయారు. తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.