తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-07T23:57:48+05:30 IST
పాఠశాలకు పోవాలని తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరులో బుధవారం చోటుచేసుకుంది.
కందుకూరు డిసెంబరు 7: పాఠశాలకు పోవాలని తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కందుకూరుకు చెందిన కోడిగంటి రాహుల్(14) గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతను గత 10 రోజుల నుంచి స్కూలుకు పోకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో బుధవారం తల్లి లావణ్య స్కూలుకు ఎందుకు పోవడం లేదని కొడుకును అడిగింది. తాను పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను తోలుకొస్తానంటూ మధ్యాహ్నం ఆమె ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చే సరికి రాహుల్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ తెలిపారు.