రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో బాండ్‌ డిస్పోజల్‌ టీమ్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-25T05:25:21+05:30 IST

రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో బాండ్‌ డిస్పోజల్‌ టీమ్‌ తనిఖీలు

రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో బాండ్‌ డిస్పోజల్‌ టీమ్‌ తనిఖీలు
వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న బాంబు డిస్పోజల్‌ టీమ్‌

వికారాబాద్‌, జూన్‌ 24 : బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ వికారాబాద్‌లోని రైల్వేస్టేషన్‌తో పాటు పరిగి బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం  ఆర్‌ఐ రత్నం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఆయన మాట్లాడుతూ ఎవరికైనా అనుమానాస్పదంగా వస్తువులు(టిఫిన్‌ బాక్సులు, సూట్‌ కేసులు, బ్యాగులు) కనిపిస్తే వాటికి దూరంగా ఉండి.. మీతోటి వారిని కూడా అప్రమత్తం చేసి తక్షణమే 100కి డయల్‌ చేయాలన్నారు. అంతేకాకుండా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవయ్య, లాల య్య, కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:25:21+05:30 IST