20 నుంచి కడ్తాలలో బోనాల వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T05:45:38+05:30 IST

20 నుంచి కడ్తాలలో బోనాల వేడుకలు

20 నుంచి కడ్తాలలో బోనాల వేడుకలు
కుల సంఘాల నాయకులతో సమావేశమైన సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

కడ్తాల్‌, ఆగస్టు 9: కడ్తాల పంచాయతీలో ఈ నెల 20న బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ కుల సంఘాలతో సర్పంచ్‌ సమావేశాన్ని నిర్వహించారు. 20న కాటమయ్య బోనాలు, 21న పెద్దమ్మ, బీరప్ప, ఈదమ్మ, మడేల్లయ్య స్వామి బోనాలు, 22న పోచమ్మతల్లి, 23న రేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి గ్రామస్తులంతా కృషిచేయాలని ఆయన కోరారు. అన్ని కుల సంఘాలు సంయుక్తంగా వేడుకల్లో భాగం పంచుకోవాలని సూంచించారు. రూపొందించుకున్న ప్రణాళిక మేరకు పండుగ కార్యక్రమాలను నిర్వహించుకుందాం అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, లాయక్‌ అలీ, వెంకటేశ్‌, నర్సింహ, బిక్షపతి, రామచంద్రయ్య, శేఖర్‌, రా ములు, బుచ్చయ్య, రాజేందర్‌గౌడ్‌, శ్రీశైలం పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:45:38+05:30 IST