వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-06-19T05:42:47+05:30 IST
వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు
శంషాబాద్ రూరల్, జూన్ 18: మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఊట్‌పల్లిలో శనివారం జరిగిన బొడ్రాయి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ పాల్గొన్ని ప్రత్యేకపూజలు నిర్వహించారు. కౌన్సిలర్లు పారెపల్లి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, కొండా ప్రవీణ్‌గౌడ్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత బుక్క వేణుగోపాల్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మారెడ్డి, వైస్‌చైర్మన్ బండి గోపాల్‌యాదవ్, నీరటిరాజు, ఆర్.గణే్‌షగుప్తా, వెంకటే్‌షగౌడ్, మహేందర్‌రెడ్డి, కృష్ణకుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రైవేటు ఆసుపత్రి ల్యాబ్‌లు ప్రారంభించిన ఎమ్మెల్యే
శంషాబాద్, జూన్ 18: మున్సిపాలిటీ పరిధిలో ఆర్బీనగర్‌లో డాక్టర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆసుపతి, ల్యాబ్‌లను శనివారం నాడు ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మారెడ్డితో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ భారతమ్మ నాయకులు పాల్గొన్నారు.