Rangareddy Dist.: బీజేపీ అధ్యక్షుడు రాజీనామా..?

ABN , First Publish Date - 2022-11-20T13:20:40+05:30 IST

రంగారెడ్డి: జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నర్శింహారెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్ నియామకంపై..

Rangareddy Dist.: బీజేపీ అధ్యక్షుడు రాజీనామా..?

రంగారెడ్డి: జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నర్శింహారెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్ నియామకంపై తనను సంప్రదించలేదని అలిగారు. మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్‌గా ఎలిమినేటి దేవేందర్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ నాయకత్వం నియమించింది. దీంతో జిల్లా అధ్యక్షుడినైన తనను సంప్రదించకుండా ఎలా నియమిస్తారని నర్శింహరెడ్డి ప్రశ్నించారు. దేవేందర్ రెడ్డి నియామకంతో అలిగి గత మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో బొక్క నర్సింహారెడ్డి ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ రంగంలోకి దిగారు.

Updated Date - 2022-11-20T13:20:46+05:30 IST