వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
బీరోల్‌లో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌

  • బీజేపీ భరోసా యాత్రలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌

బంట్వారం(కోట్‌పల్లి),సెప్టెంబరు 29: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావ డం ఖాయమని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం బీరోల్‌, కరీంపూర్‌, నాగసాన్‌పల్లి, కరీంపూర్‌, మోత్కుపల్లి, జిన్నారం, రాంపూర్‌, ఎన్కెపల్లి, ఎన్నారం, బార్వాద్‌, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఆయ న ‘ప్రజాగోస-బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో బీజేపీ జెండాలు అవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం సీఎం కేసీఆర్‌ కుటుంబానికి సంబంధించిన వారే అభివృద్ధి చెందా రన్నారు. ప్రజల భవిష్యత్తును కేసీఆర్‌ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు, నిధులు వస్తాయని ఎంతో మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రజల అభివృద్ధిని పక్కనబెట్టి కేసీఆర్‌ కుటుంబం, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్థికంగా బలపడ్డారని ఆయన గుర్తుచేశారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి ఆయ్యాక చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులనూ కేసీఆర్‌ మళ్లించాడన్నారు. ఎన్నికల హమీలు అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ యాత్రలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నమన్నారు. ప్రజలు వారి సమస్య లను ఏకరవు పెడుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని ఇకపై బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. గ్రామాల్లో బీటీ రోడ్లు, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, నీరు తదితర సమస్యలు తమ దృష్టిక వచ్చాయన్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులకు సూచించాలి ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం కోట్‌పల్లిలో వీఆర్‌ఏల ధర్నాలో పాల్గొని చంద్రశేఖర్‌ వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటన్నారు. ఈ కార్యక్రమ ంలో కోట్‌పల్లి మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more