రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
ABN , First Publish Date - 2022-12-31T00:01:46+05:30 IST
‘‘రాష్ట్రంలో 2023 డిసెంబరు తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..’’ అని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
మహేశ్వరం, డిసెంబరు 30 : ‘‘రాష్ట్రంలో 2023 డిసెంబరు తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..’’ అని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మహేశ్వరం మండలం అమీర్‌పేటలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బీజేవైఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే అమలు చేయలేని వాగ్దానాలు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రూ.2లక్షల కోట్లతో దళితబంధు అమలు చేస్తానంటూ దళితులను మభ్య పెడుతున్నారని అన్నారు. దళితబంధు నిధులు బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే చెందుతున్నాయన్నారు. సీఎం చెప్పినట్లు దళితబంధు అమలు చేస్తే 40ఏళ్లు పడుతుందన్నారు. 2023లో ఆయన గద్దె దిగడం ఖాయమన్నారు. దళిత కుటుంబాలతోపాటు నిరుపేదలకు, సంచార జాతులకు కూడా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నతోద్యోగులకు, పెద్దలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తూ 3వ సారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి యత్నిస్తుందన్నారు. యువమోర్చా కార్యకర్తలు యుద్ధసైనికుల్లా కర్తవ్యం నిర్వహించి బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరుపేదలందరికీ అందేలా కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తెల్గమల్ల యాదీష్, నాయకులు బొక్కనర్సిహారెడ్డి, పాపయ్యగౌడ్, మిద్దె సుదర్శన్‌రెడ్డి, మాదవాచారి, కాసాని వెంకటే్‌షగౌడ్, అనంతయ్యగౌడ్, అందెల శ్రీరాములుయాదవ్, బోసుపల్లి ప్రతాప్, ప్రేమ్‌రాజ్ యాదవ్, జంగయ్యయాదవ్, కుండె వెంకటేష్, అర్జున్‌రెడ్డి, దిలీ్పగౌడ్, బుగ్గని శంకర్, సాయులు, ప్రకాష్, శ్రీశైలం, విష్టువర్ధన్‌రెడ్డి, అఖిల్ పాల్గొన్నారు.