గోవాకు బయల్దేరిన బైక్‌ రైడర్లు

ABN , First Publish Date - 2022-11-16T23:55:08+05:30 IST

గోవాలో జరిగే రైడర్‌ మానియా ఈవెంట్‌లో పాల్గొనడానికి శంషాబాద్‌తోపాటు జంటనగరాలకు చెందిన దాదాపు 100మంది రైడర్లు బుధవారం బయల్దేరి వెళ్లారు.

గోవాకు బయల్దేరిన బైక్‌ రైడర్లు
ర్యాలీని ప్రారంభిస్తున్న ఇఫ్తెకార్‌ హైమద్‌షరీఫ్‌

శంషాబాద్‌, నవంబర్‌ 21 : గోవాలో జరిగే రైడర్‌ మానియా ఈవెంట్‌లో పాల్గొనడానికి శంషాబాద్‌తోపాటు జంటనగరాలకు చెందిన దాదాపు 100మంది రైడర్లు బుధవారం బయల్దేరి వెళ్లారు. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికోసం శంషాబాద్‌ నుంచి గోవాకు రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్‌) బైక్‌లపై ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీని శంషాబాద్‌కు చెందిన స్థానిక ఎన్నారై, డ్యుయెల్‌ సిటిజన్‌షిప్‌ కలిగిన ఇఫ్తెకార్‌ హైమద్‌షరీఫ్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కాస్మోమోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుషన్‌అహ్మద్‌తోపాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:55:08+05:30 IST

Read more