ఆలయ నిర్మాణానికి భూమి పూజ
ABN , First Publish Date - 2022-10-18T05:23:47+05:30 IST
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తలకొండపల్లి, అక్టోబరు 17: చీపునుంతల గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఎర్ర సుదర్శన్‌రెడ్డి స్థలాన్ని కేటాయించగా అర్చకుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో సోమవారం భూమిపూజ చేశారు. సర్పంచ్ బండి రఘుపతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అంతకుముందు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ స్థల దాత సుదర్శన్‌రెడ్డిని సర్పంచ్ రఘుపతి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్, ఉపసర్పంచ్ లక్ష్మీదేవి, వార్డుసభ్యులు, నాయకులు బాలకుమార్, పెంటయ్య, నర్సింహ, శ్రీశైలం, మల్లేశ్, శేఖర్, చెన్నకేశవులు, బ్రహ్మచారి, దేవేందర్, జనార్ధన్‌రెడ్డి, వెంకట్‌రాజ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.