స్వాతంత్య్ర దినోత్సవాన ఉత్తమ సేవా అవార్డులు

ABN , First Publish Date - 2022-08-16T05:54:53+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన ఉత్తమ సేవా అవార్డులు

స్వాతంత్య్ర దినోత్సవాన ఉత్తమ సేవా అవార్డులు
ఎండోమెంట్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ నుంచి అవార్డు అందుకుంటున్న ఈవో టి.నరేందర్‌

తాండూరు రూరల్‌/తాండూరు/ఘట్‌కేసర్‌/బషీరాబాద్‌,శామీర్‌పేట, ఆగస్టు 15: స్వాత్రంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పలువురు అధికారులకు ప్రభుత్వం ఉత్తమ సేవ అవార్డులు, ప్రశంశా పత్రాలు అందజేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉత్తమ కార్యనిర్వహణాధికారిగా టి.నరేందర్‌ ఎండోమెంట్‌ శాఖ అవార్డును అందుకున్నారు. అవార్డును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్‌లో అందుకున్నారు. తాండూరు మండలం కరన్‌కోట్‌ సీఐగా పనిచేసిన జలందర్‌రెడ్డికి వికారాబాద్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు పోలీసు సేవా పతాకాన్ని అందజేశారు. జలందర్‌రెడ్డి ఇటీవలే సంగారెడ్డికి బదిలీ అయ్యారు. బషీరాబాద్‌ డిప్యూటీ తహసీల్దార్‌ వీరేశంబాబు ఈ నెల 22న మంత్రి, జిల్లా కలెక్టర్ల చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీకి అవార్డుల పంట పండింది. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉత్తమ మున్సిపల్‌ కమిషనర్‌గా పోచారం కమిషనర్‌ సురేష్‌ మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రశంశా పత్రం అందుకున్నారు. ఏఈ నరే్‌షకుమార్‌, కార్మికుడు రాఖీ ఉత్తమ అవార్డులు అందుకున్నారు. శామీర్‌పేట సర్పంచ్‌ బాలమణి, పంచాయతీ కార్యదర్శి శశికుమార్‌లకు మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ హరీష్‌ ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు. అలాగే హకీంపేట ఆర్టీసీ డిపోలో కార్గో మార్కెటింగ్‌ పీసీసీ కౌంటర్‌ అసిస్టెంట్‌ గోపు శ్రీనివా్‌సను డీఎం భవభూతి, అసిస్టెంట్‌ మేనేజర్‌ సునిత అవార్డును అందజేశారు.

Read more