-
-
Home » Telangana » Rangareddy » Benefits of reading a book Kappati-MRGS-Telangana
-
పుస్తక పఠనంతో ప్రయోజనాలు : కప్పాటి
ABN , First Publish Date - 2022-09-27T04:48:05+05:30 IST
ఎన్ని మాధ్యమాలు వచ్చినా.. మనిషికి పుస్తకాల

రంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 26 : ఎన్ని మాధ్యమాలు వచ్చినా.. మనిషికి పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానమే ఉన్నతమైందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి అన్నారు. కందుకూరు మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి అమెరికా నుంచి తీసుకు వచ్చిన విలువైన అంతర్జాతీయ పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి ఉచితంగా అందజేశారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే అంతర్జాతీయ పుస్తకాలను అందజేసిన మూల హన్మంత్రెడ్డిని సంస్థ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేమూరు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సిబ్బంది సత్యనారాయణ, ప్రతాప్, జైహింద్, ప్రసన్న, మమత పాల్గొన్నారు.