కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలతో సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-12-15T23:05:30+05:30 IST

కొత్త సంవత్సరానికి అధికారులు నూతన లక్ష్యాలను ఏర్పర్చుకొని సిద్ధంగా ఉండాలని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు.

కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలతో సిద్ధంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి

అధికారులతో సమావేశం

వికారాబాద్‌, డిసెంబరు 15: కొత్త సంవత్సరానికి అధికారులు నూతన లక్ష్యాలను ఏర్పర్చుకొని సిద్ధంగా ఉండాలని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులంతా పెండింగ్‌ పైళ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. 2023 సంవత్సరంలో నూతన లక్ష్యాలతో వృత్తిపరంగా అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. గతేడాది తమ శాఖలో పెట్టుకున్న లక్ష్యాలు.. సీసీ కెమెరాలు/టీవీల ఏర్పాటు, రోడ్‌ యాక్సిడెంట్ల తగ్గింపునకు చర్యలు, ఆత్మహత్యల నివారణ తదితర అంశాల్లో పురోగతి సాధించామన్నారు. 2023లోనూ నూతన లక్ష్యాల సాధనకు శ్రమించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, పరిగి, వికారాబాద్‌, తాండూరు డీఎస్పీలు అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:05:31+05:30 IST