చిత్తూ చిత్తూల బొమ్మ..

ABN , First Publish Date - 2022-09-26T05:11:57+05:30 IST

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..
ఏదులాబాద్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే పూల పండుగ బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తీరొక్క పూలతో ఆదివారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఆలయాలు, వివిధ కాలనీల్లో  సామూహికంగా బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించారు. చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడిపాడారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి  చెరువులు, కుంటల్లో  నిమజ్జనం చేశారు.

Read more