తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-29T05:28:07+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
కలెక్టరేట్‌ వద్ద బతుకమ్మ ఆడుతున్న ఉద్యోగినులు

రంగారెడ్డి అర్బన్‌/ఇబ్రహీంపట్నం/కడ్తాల్‌/శంషాబాద్‌, సెప్టెంబరు 28: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీక అని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల 4వ రోజు బుధవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో బతుకమ్మ ఆడారు. డీఆర్వో హరిప్రియ, ఏవో ప్రమీల బతుకమ్మ పూజలు నిర్వహించారు. ఉద్యోగినులతో బతుకమ్మ ఆడారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండగ బతుకమ్మ అన్నారు. సంరబాల్లో జిల్లా పౌరసరఫరాల డీఎం శ్యామరాణి, డీఈవో సుశీందరరావు పాల్గొన్నారు. ఏబీవీపీ  ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పరిధి బృందావన్‌కాలనీలో బ తుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు కందడి శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను బతుకమ్మ ప్రతీక అన్నారు. నాయకులు వంగ సంజీవరెడ్డి, శశిధర్‌రెడ్డి, సందీప్‌, పవన్‌, ప్రవీణ్‌కుమార్‌, ముత్యాలు, సాయిచంద్‌ పా ల్గొన్నారు. కడ్తాల మండల పరిషత్‌ వద్ద బుధవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి,  ఎంపీడీవో రామకృష్ణ వేడుకలను ప్రారంభి ంచారు. ఏపీఎం రాజేశ్వరి, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్‌లో సిరి ఉమెన్స్‌ సంస్థ ఆధ్వర్య ంలో మంగళవారం రాత్రి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. జిల్లా పరిషత్‌ పాఠశాల మైదానంలో జరిగిన ఈ సంబరాలకు ఎమ్మెల్యేప్రకా్‌షగౌడ్‌ హాజరయ్యారు. ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి మాట్లాడుతూ సిరి సంస్థ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలను ప్రోత్సహిస్తున్నారన్నా రు. ఆర్డీవో చంద్రకళ, కౌన్సిలర్లు, నాయకులు మహే ందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, మహిళలు పాల్గొన్నారు.

Read more