తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-27T04:25:44+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
బతుకమ్మ ఆడుతున్న జిల్లా కలెక్టర్‌, మహిళా అధికారులు

  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌/మేడ్చల్‌అర్బన్‌,సెప్టెంబరు26: తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుమ్మ పండుగను మహిళలు అందరూ పెద్దఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించుకోవాలని  కలెక్టర్‌ నిఖిల అన్నారు. డీఆర్‌డీవో, మహిళ సంక్షేమ శాఖ, మునిసిపాలిటీ, జిల్లా వ్యవసాయశాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో పూల పండుగను జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణంలోని మహిళలందరూ పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.   కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితాకుమారి, డీఆర్‌డీవో కృష్ణన్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  కాగా కొడంగల్‌ మండలం రుద్రారంలో బతుకమ్మ వేడుకల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి ఆడిపాడారు. 

 మేడ్చల్‌ కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగుల ఆటాపాట

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బతుకమ్మ  వేడుకల్లో మహిళా ఉద్యోగులందరూ ఆటాపాటలతో సంబురాల్లో మునిగిపోయారు. అటు విధులు నిర్వహిస్తునే భోజన విరామ సమయంలో రెండో రోజు అటుకుల బతుకమ్మ సందర్భంగా వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారంవద్ద మహిళా ఉద్యోగులందరు బతుకమ్మ, కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ కమిటీ కన్వీనర్‌ పద్మజారాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి పావని,  వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T04:25:44+05:30 IST