తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక

ABN , First Publish Date - 2022-09-28T05:03:11+05:30 IST

తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక

తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న డీకే అరుణ

  • బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

వికారాబాద్‌, సెప్టెంబరు 27: తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం భృంగి విద్యా సంస్థల ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భృంగి విద్యాసంస్థల కార్యదర్శి ప్ర మీలచంద్రశేఖర్‌ విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్లతో కలిసి అరుణ బతుకమ్మ ఆడారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడచు లు చిన్నాపెద్ద అందరూ సంతోషంగా జరుపుకునే పెద్దపండుగ బతుకమ్మ అన్నారు. కార్యక్రమంలో ఎ.చరణ్‌, అఖిల్‌, భృంగి డైరెక్టర్లు కుమారస్వామి, శివప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ రమాదేవి, ఉపాధ్యాయురాళ్లు శిరీష, విజయలక్ష్మి, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.


  • కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

మేడ్చల్‌ అర్బన్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో మంగళవారం మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహించారు. జిల్లా అదనపు ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, అధికారిణులు, విద్యార్థినులతో కలిసి కోలాటం ఆడారు. విద్యా, మత్స్య, కార్మిక శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించగా పాఠశాలల విద్యారి నులు వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.


సింధూ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

తాండూరు: తాండూరులోని సింధూ డిగ్రీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ ఆడుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీపానర్సింహులు, కౌన్సిలర్‌ సంగీతాఠాగూర్‌, కళాశాల యాజమాన్య ప్రతినిధి, కౌన్సిలర్‌ విజయాదేవి, కరస్పాండెంట్‌ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Read more