ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-03T05:44:51+05:30 IST

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు
మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద బతుకమ్మలతో ఎంపీపీ, ఉద్యోగినులు

నవాబుపేట/మేడ్చల్‌/ధారూరు, అక్టోబరు 2: బతుకమ్మ సంబురాలు గ్రామాలు, పట్టణాల్లో ఘనంగా కొనసాగు తున్నాయి. ఆదివారం నవాబుపేటలో బతుకమ్మ వేడుక ల్లో చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. ఆయ నతో ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. మేడ్చల్‌ మండల పరిషత్‌ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించా రు. ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, ఎంపీడీవో రమాదేవి పాల్గొని బతుకమ్మ ఆడారు. మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకురాళ్లు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ధారూరులో బతుకమ్మ వేడుకను నిర్వహించారు.మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మలతో ఉరేగింపుగా వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను గ్రామ కుంటలో నిమజ్జనం చేశారు.

Read more