మంత్రి హరీశ్‌రావును కలిసిన బన్సీలాల్‌

ABN , First Publish Date - 2022-10-08T04:08:01+05:30 IST

మంత్రి హరీశ్‌రావును కలిసిన బన్సీలాల్‌

మంత్రి హరీశ్‌రావును కలిసిన బన్సీలాల్‌
మంత్రి హరీశ్‌ రావుతో మల్కేడి బన్సీలాల్‌

ఆమనగల్లు, అక్టోబరు 7: మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ పరిరక్షణ, బయోడిజిల్‌ అభివృద్ది సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మల్కేడి బన్సీలాల్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం ఉదయం మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బన్సీలాల్‌ మర్యాదపూర్వకంగా కలిసిపుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మునుగోడు ఎన్నికల ప్రచారానికి తన వెంట రావాలని మంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని బన్సీలాల్‌ ధీమా వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-10-08T04:08:01+05:30 IST