‘ఆయుష్‌ గ్రామ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-06T05:07:35+05:30 IST

‘ఆయుష్‌ గ్రామ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి

‘ఆయుష్‌ గ్రామ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దులూరులో నిర్వహించిన వైద్యశిబిరంలో ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌, మార్చి 5 : అందరికీ ఆరోగ్యమనే లక్ష్యం దిశగా ఆరోగ్య ఆయుష్‌ ముందుకు వెళుతోందని, నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద ఆయుష్‌ గ్రామ్‌ పేరిట నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ వారు నిర్వహించిన ఆయుష్‌ గ్రామ్‌ ఆయుర్వేద క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో మూడు రోజుల క్యాంపు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని, అందరికీ ఆరోగ్యం దిశగా చేపట్టాల్సిన విషయాలపై అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ అంజయ్య, ఎంపీటీసీ గౌసోద్దిన్‌, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, వైద్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రోజురోజుకూ టీఆర్‌ఎస్‌ బలోపేతం

రోజురోజుకూ టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలోపేతంగా మారుతోందని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే సమక్షంలో వికారాబాద్‌ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు యూను్‌సతో పాటు మరో 40మంది యువకులు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మెడికల్‌ కళాశాలతో భావితరాలకు బంగారు భవిష్యత్తు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని ఎస్‌ఏపీ కళాశాల వెనుకవైపు గల ప్రభుత్వ స్థలాన్ని ఆయన రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కాగా, జిల్లాకు ప్రభుత్వం ఇప్పటికే మెడికల్‌ కళాశాల మంజూరు విషయంలో స్పష్టత ఇవ్వడంతో అందుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ ముత్తహార్‌ షరీఫ్‌, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, తహసీల్దార్‌ షర్మిల, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Read more