లింగ సమానత్వంపై అవగాహన

ABN , First Publish Date - 2022-03-06T05:17:10+05:30 IST

లింగ సమానత్వంపై అవగాహన

లింగ సమానత్వంపై అవగాహన

వికారాబాద్‌, మార్చి 5: సమాజంలో స్త్రీలు కూడా పురుషులతోపాటు సమాన హక్కులు కలిగి ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి లలితకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శిశుగృహలో జిల్లాలోని ఐసీడీఎస్‌ సిబ్బందికి ‘స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు మహిళకు  పురుషులతో సమాన హక్కులు ఉండాలని, గృహ హింస, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో వారం రోజుల పాటు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వారం రోజుల పాటు గ్రామస్థాయిలో జెండర్‌ ఈక్వాలిటీ, గ్రామీణ స్థాయిలో డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీలు, జిల్లా స్థాయి అధికారులతో సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బచావో ఆందోళన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ వెంకటేశ్వర్లు, బీఆర్‌బీ కోఆర్డినేటర్‌ లక్ష్మి, జిల్లాస్థాయి ఐసీడీఎస్‌ సిబ్బంది వెంకటేశ్వరమ్మ, ప్రియదర్శిని, రేణుక, కృష్ణవేణి, విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలున్నారు.

Updated Date - 2022-03-06T05:17:10+05:30 IST